Tirumala : శ్రీవారిని దర్శించుకున్న ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్
ఏపీ గవర్నర్ (Ap Governor ) అబ్దుల్ నజీర్ తిరుమల పుణ్యక్షేత్రానికి విచ్చేశారు. స్వామివారి దర్శనం కోసం ఆలయం వద్దకు చేరుకున్న గవర్నర్ కు తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో ధర్మారెడ్డి, ఆలయ అర్చకులు, వేదపండితులు శాస్త్రోక్తంగా ఇస్తి కఫాల్ స్వాగతం పలికారు.
తిరుమల(Tirumala) శ్రీవారిని శనివారం ఏపీ గవర్నర్(Ap Governor ) ఎస్. అబ్దుల్ నజీర్ కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. ముందుగా ఆలయం వద్దకు చేరుకున్న గవర్నర్కు టీటీడీ ఈవో(Ttd EO) ఎవి.ధర్మారెడ్డి స్వాగతం పలకగా, ఆలయ అర్చకులు ఇస్తి కఫల్ స్వాగతం పలికారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేశారు.అనంతరం ఈవో శ్రీవారి తీర్థప్రసాదాలు అందించారు. అంతకుముందు గవర్నర్ కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల క్షేత్ర సాంప్రదాయాన్ని పాటిస్తూ శ్రీ వరాహస్వామి(Varaha Swamy)వారిని దర్శించుకున్నారు. గవర్నర్ వ్యక్తిగత కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్(Anil Kumar Singhal), జిల్లా ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి, సీవీఎస్వో నరసింహకిషోర్, డిప్యూటీ ఈవో లోకనాథం, వీజీవో బాలిరెడ్డి, అధికారులు పాల్గొన్నారు.తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు రెండు కంపార్ట్మెంట్ల(Compartments) లో వేచియున్నారు. టోకెన్లు లేని భక్తులకు 12 గంటల్లో సర్వదర్శనం అవుతుందని టీటీడీ (TTD) అధికారులు తెలిపారు. నిన్న స్వామివారిని 59,071 మంది భక్తులు దర్శించుకోగా 27,651 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 4.12 కోట్లు వచ్చిందని వివరించారు.