AKP: రాజయ్యపేటలో మత్స్యకారులు చేస్తున్న రిలే దీక్ష శిబిరానికి వెళుతున్న తనను అడ్డుకోవడం దుర్మార్గం అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. నక్కపల్లి మండలం ఉపమాకలో మాట్లాడుతూ.. అడ్డుకోవడానికి మేము టెర్రరిస్టులమా లేక రాజయ్యపేట నిషేధిత ప్రాంతమా అని ప్రశ్నించారు. ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్తానన్నారు.