GNTR: ములకలచెరువులో బయటపడిన నకిలీ మద్యం కేసులో తెనాలి ఐతానగర్‌కు చెందిన వైసీపీ కార్యకర్త కొడాలి శ్రీనివాసరావు ఆచూకీ కోసం ఎక్సైజ్ అధికారులు గాలిస్తున్నారు. ఆయన లీజ్‌పై తీసుకున్న షెడ్లోనే నకిలీ మద్యం తయారీ జరిగినట్టు విచారణలో తేలింది. మొబైల్ సిగ్నల్ చివరిగా గుంటూరు విద్యానగర్ వద్ద ఆగిపోయినట్టు సమాచారం. మూడు ప్రత్యేక బృందాలు ఆయనను వెతుకుతున్నాయి.