ADB: కేంద్ర మాజీ మంత్రి గడ్డం వెంకటస్వామి జయంతి సందర్భంగా మాల సంక్షేమ సంఘం జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సంఘం జిల్లా అధ్యక్షుడు కొప్పుల రమేశ్ మాట్లాడుతూ.. వెంకటస్వామి మాలలకు ఎన్నో హక్కులను సాధించి పెట్టారని కొనియాడారు. అణగారిన వర్గాల అభ్యున్నతికి ఎంతో కృషి చేశారని, ఆయన సేవలు చిరస్మరణీయమని అన్నారు.