JGL: ఖరీఫ్ సీజన్లో సాగు చేసిన మొక్కజొన్న పంట రైతుల చేతికి రాగా ప్రభుత్వం మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో సుమారు 32వేల ఎకరాల్లో మొక్కజొన్న పంటను సాగు చేశారు. ప్రభుత్వ మద్దతు ధర క్వింటాల్‌కు రూ. 2,400 కాగా దళారులు రూ.1,900 చెల్లిస్తూ ఉండడంతో రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారు.