కర్నూలు చౌరస్తా సమీపంలోని ఆర్టీసీ జోనల్ స్టాఫ్ ట్రైనింగ్ కళాశాలలో శిక్షణ పొందుతున్న డ్రైవర్లతో జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి శుక్రవారం సమావేశమయ్యారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. అతివేగం, ఓవర్ టేకింగ్‌కు దూరంగా ఉండాలని, రాష్ డ్రైవింగ్ వల్ల ప్రయాణికుల ప్రాణాలకు ప్రమాదం ఉంటుందని పేర్కొన్నారు.