NZB: వాహనంపై పెండింగ్ చలాన్లు ఉన్నాయని.. వెంటనే చెల్లించాలంటూ ఆర్టీఏ చలాన్ పేరుతో ఏపీకే లింక్లు వాట్సాప్ గ్రూపులకు రావడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. బాన్సువాడ డివిజన్ పరిధిలో అధికంగా ఆర్టీఏ చలాన్ పేరుతో ఏపీకే లింక్లు వాట్సప్ నంబర్లకు రావడంతో వ్యక్తిగత ఫోన్లు హ్యాక్ అవుతున్నాయని ఓ అధికారిణి శనివారం పోలీసులకు సమాచారం అందించారు.