»Rajasthan Who Beat Csk Thoroughly Are At The Top Of The Points Table Ipl 2023
IPL 2023: చెన్నైని చిత్తుగా ఓడించిన రాజస్తాన్..పాయింట్ల పట్టికలో అగ్రస్థానం
ఆడమ్ జంపా, రవిచంద్రన్ అశ్విన్ ఐదు వికెట్లు పడగొట్టి అద్భుతమైన బౌలింగ్ వేయడంతో చైన్నై సూపర్ కింగ్స్(CSK) పరుగులను కట్టడి చేశారు. అంతేకాదు రాజస్థాన్ రాయల్స్(RR) చెన్నై సూపర్ కింగ్స్ పై 32 పరుగుల తేడాతో విజయం సాధించారు. అంతేకాదు పాయింట్ల పట్టకలో కూడా
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2023) 37వ మ్యాచులో గురువారం చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్(RR) 32 పరుగుల తేడాతో సులువుగా విజయం సాధించింది. జైపూర్‌లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో మొత్తం 202 పరుగులను చేసిన RR జట్టు 203 పరుగుల లక్ష్యాన్ని CSKకు ఉంచింది. ఈ క్రమంలో RR ఆటగాళ్లు యశస్వి జైస్వాల్ 77, ధృవ్ జురెల్ 34, బట్లర్, పడిక్కలో చెరో 27 రన్స్ చేేసి మంచి భాగస్వామ్యం అందించారు.
ఇక ఛేజింగ్ కు దిగిన CSK జట్టులో శివం దూబే 52, రుతురాజ్ గైక్వాడ్ 47 పరుగులు మినహా ఏ ఒక్కరూ కూడా రాణించలేక పోయారు. ఈ నేపథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ పరుగుల కోసం పోటాపోటీగా పోరాడింది. కానీ 6 వికెట్ల నష్టానికి 170 రన్స్ మాత్రమే చేయగలిగారు. దీంతో రాజస్తాన్ రాయల్స్ 32 పరుగుల తేడాతో మ్యాచ్‌ను గెలుచుకుంది.
ఈ ఐపీఎల్ చరిత్రలో సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో రాజస్తాన్ జట్టుదే అత్యధిక స్కోరు కావడం విశేషం. రాజస్థాన్ రాయల్స్ తిరిగి విజయపథంలోకి రావాలని చూస్తున్నందున సంజూ శాంసన్ చెన్నై సూపర్ కింగ్స్‌పై టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ విజయంతో రాజస్తాన్ రాయల్స్ పాయింట్ల పట్టికలో మళ్లీ అగ్రస్థానానికి ఎగబాకింది.