NLG: దసరా పర్వదినం సందర్భంగా నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, నార్కట్ పల్లిలో గురువారం ఆయన నివాసంలో కుటుంబ సభ్యులతో కలిసి పాలపిట్టను ఆకాశంలోకి ఎగురవేసి ఆశీర్వచనాలు కోరుకున్నారు. విజయదశమి నియోజకవర్గ ప్రజలందరికీ విజయాలు చేకూర్చాలని ఆకాంక్షించారు. దసరా రోజున పాలపిట్టను చూడటం తెలంగాణలో అదృష్టంగా భావిస్తారని పేర్కొన్నారు.