‘కాంతార 1’ టీమ్‌పై యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రశంసల జల్లు కురిపించాడు. ఈ సినిమా అద్భుతమైన విజయం సాధించినందుకు ఆయన సోషల్ మీడియా ద్వారా అభినందనలు తెలిపాడు. ‘దర్శకుడు, నటుడు అయిన రిషబ్‌శెట్టి అసాధారణమైన ఆలోచనలతో ఊహకందని అద్భుతాన్ని సృష్టించారు. హోంబలే ఫిల్మ్స్‌తో పాటు, చిత్ర బృందంలోని వారందరికీ నా శుభాకాంక్షలు’ అని NTR పేర్కొన్నాడు.