మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్నం శ్రీనివాస్ రెడ్డికి పట్టణానికి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు దసరా శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయనను కలిసిన వారిలో మాజీ మున్సిపల్ ఛైర్మన్ ఆనంద్ కుమార్ గౌడ్, MUDA ఛైర్మన్ లక్ష్మణ్ యాదవ్, డీసీసీ జనరల్ సెక్రటరీ సిరాజ్ ఖాద్రి, ఆంజనేయులు గౌడ్ తదితరులు ఉన్నారు. తిరిగి ఎమ్మెల్యే కూడా వారికి శుభాకాంక్షలు తెలియజేశారు.