SRPT: మహాత్మాగాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అన్నారు. గురువారం సూర్యాపేటలోని కలెక్టరేట్లో, నిర్వహించిన మహాత్మా గాంధీ జయంతి వేడుకల్లో పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి మాట్లాడారు. గాంధీజీ సత్యం, అహింస, శాంతి వంటి విలువలను పాటిస్తూ దేశానికి స్వాతంత్ర్యం సాధించాడన్నారు.