GNTR: పొన్నూరులో అక్రమంగా తరలిస్తున్న 300 బస్తాల రేషన్ బియ్యాన్ని పొన్నూరు అర్బన్ పోలీస్ స్టేషన్ సీఐ ఎల్.వీరా నాయక్, పోలీసు సిబ్బందితో కలిసి దాడి చేసి పట్టుకున్నారు. వాహనాన్ని పోలీస్ స్టేషన్కు తరలించి, డ్రైవర్ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ ఇవాళ మీడియాకు తెలిపారు.