VZM: దసరా పర్వదినాన్ని పురస్కరించుకుని జిల్లా ఆర్మ్డ్ రిజర్వు విభాగంలో పోలీసులు విధి నిర్వహణలో వినియోగించే ఆయుధాలు, పోలీసు వాహనాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. SP దామోదర్ కుటుంబ సమేతంగా ఈ పూజల్లో పాల్గొని దుర్గామాతకు ప్రత్యేక పూజలు చేశారు. చెడుపై మంచి గెలుపుకు ప్రతీక దసరా అని ప్రజలు, పోలీసులు సుఖశాంతులతో జీవించాలన్నారు.