KMM: విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని, కారేపల్లి మండలం ఉసిరికాయలపల్లి గ్రామంలోని కోట మైసమ్మ అమ్మవారిని గురువారం బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యే తాతా మధుసూదన్ దర్శించుకున్నారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వారికి ఆలయ అర్చకులు, కమిటీ సభ్యులు, ఆలయ ఛైర్మన్ పట్టాభి రామారావు ఘన స్వాగతం పలికి శాలువాతో సత్కరించారు.