MDCL: దేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా కీసర మండలం యాదగిరిపల్లి గ్రామం, పోచారంలో ఏర్పాటు చేసిన దుర్గామాతను ఎంపీ ఈటల రాజేందర్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శక్తి రూపమైన దుర్గామాతను 9 రోజులు 9 రూపాలలో పూజిస్తారని, చివరి రోజున విజయ దశమిగా జరుపుకుంటారన్నారు. చెడుపై మంచి సాధించిన విజయాన్ని ఈ పండుగ సూచిస్తుందన్నారు.