VZM: కొత్తవలస మండల సమాఖ్య ఆధ్వర్యంలో మహిళలకు పెరటికోళ్ళు పెంపకం కోసం 45 యూనిట్లు మండలానికి మంజూరు చేసినట్లు ఏపీఎం వెంకటరమణ తెలిపారు. మంజూరైన ఒక్కో యూనిట్ రూ 4,500 విలువైన కోళ్ళు మహిళలకు ఇచ్చారు. వాటిని ఇంటి వద్ద పెంచుకుని, తద్వారా ఉత్పత్తి అయ్యే గుడ్లు తినడం, అమ్మకం వలన మంచి పోషకాలతో కూడిన ఆహారం తీసుకోవడం వలన మంచి ఆరోగ్యం లభిస్తుందన్నారు.