MHBD: కొత్తగూడ మండలం బొత్తవాని గూడెంకు చెందిన సురేందర్ కుటుంబ కలహాల కారణంగా ఇవాళ పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. అపస్మారక స్థితికి చేరుకున్న అతన్ని కుటుంబ సభ్యులు 108 అంబులెన్స్‌లో నర్సంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు స్థానికులు తెలిపారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.