నేటి ఐపీఎల్(IPL) మ్యాచ్లో లక్నో సూపర్ జెయింట్స్(Lucknow super Giants)పై గుజరాత్ టైటాన్స్(Gujarat Titans) ఘన విజయం సాధించింది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ 7 పరుగుల తేడాతో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. మ్యాచ్లో భాగంగా మొదట బ్యాటింగ్ చేపట్టిన గుజరాత్ టైటాన్స్ జట్టు 135 స్వల్ప స్కోరు మాత్రమే చేసింది. 136 పరుగుల టార్గెట్తో బరిలోకి దిగిన లక్నో 128 పరుగలకే ఆలౌట్ అయ్యింది.
గుజరాత్ టైటాన్స్(Gujarat Titans) జట్టు బౌలర్ మోహిత్ శర్మ 20వ ఓవర్లో అద్భుత బౌలింగ్ చేశాడు. నాలుగు వికెట్లను పడగొట్టి లక్నోను కట్టడి చేశాడు. లక్నో సూపర్ జెయింట్స్(Lucknow super Giants) అనూహ్యంగా ఓటమి పాలైంది. కేఎల్ రాహుల్ 68 పరుగులు చేసినా లాభం లేకుండా పోయింది. లక్నో మూడు ఓటమిని చవిచూసింది. చివరి ఓవర్ ఉత్కంఠగా సాగింది. ఆ ఓవర్లో గుజరాత్ బౌలర్ మోహిత్ శర్మ కేఎల్ రాహుల్ ను ఔట్ చేశాడు. ఆ తర్వాత బంతికి స్టోయినిస్ ను డకౌట్ చేశాడు.
ఇక చివరి ఓవర్ నాలుగో బంతికి రెండు పరుగులు చేసేందుకు ప్రయత్నించిన ఆయుష్ బదొని 8 పరుగులకే రన్ ఔట్ అయ్యాడు. ఐదో బంతికి దీపక్ హుడా కూడా రనౌట్ అవ్వడంతో లక్నో గెలుపు ఆశలు తారుమారయ్యాయి. ఆఖరి బంతికి 8 పరుగులు చేయాల్సి ఉంది. కానీ ఒక్క పరుగు కూడా లక్నో చేయలేకపోయింది. దీంతో 7 పరుగుల తేడాతో గుజరాత్ టైటాన్స్(Gujarat Titans) జట్టు లక్నో సూపర్ జెయింట్స్ (Lucknow super Giants)పై ఘన విజయం సాధించింది.