SKLM: ఎచ్చెర్ల ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో ఈనెల 9న ప్రధానమంత్రి జాతీయ అప్రెంటిస్ మేళా నిర్వహిస్తున్నట్లు ప్రధానాచార్యులు, జిల్లా కన్వీనర్ ఎల్.సుధాకరరావు తెలిపారు. ఈ మేళాకు తొమ్మిది కంపెనీల ప్రతినిధులు హాజరుకానున్నారన్నారు. ఐటీఐ ఉత్తీర్ణులైన అభ్యర్థులు బయోడేటాతో హాజరుకావాలని కోరారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.