»Cm Kcr Participated In Ramzan Celebrations At Home Minister House
Ramzan: హోంమంత్రి ఇంట్లో రంజాన్ వేడుకల్లో పాల్గొన్న సీఎం కేసీఆర్
రాష్ట్రంలో రంజాన్(Ramzan) పండుగను ముస్లిం సోదరులు ఘనంగా జరుపుకున్నారు. ప్రత్యేక ఆహ్వానం మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR) రాష్ట్ర హోంమంత్రి మహముద్ అలీ(Home Minister Mahammud ali) ఇంటికి వెళ్లారు. హోం మంత్రి ఇంట్లో ముఖ్యమంత్రి కేసీఆర్ రంజాన్ వేడుకల్లో పాల్గొన్నారు.
Ramzan: రాష్ట్రంలో రంజాన్(Ramzan) పండుగను ముస్లిం సోదరులు ఘనంగా జరుపుకున్నారు. ప్రత్యేక ఆహ్వానం మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR) రాష్ట్ర హోంమంత్రి మహముద్ అలీ(Home Minister Mahammud ali) ఇంటికి వెళ్లారు. హోం మంత్రి ఇంట్లో ముఖ్యమంత్రి కేసీఆర్ రంజాన్ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా హోంమంత్రి కుటుంబ సభ్యులకు కేసీఆర్ రంజాన్ ముభారక్ తెలిపారు. అనంతరం వారు ఇచ్చిన ప్రత్యేక విందును స్వీకరించారు. ఈ వేడుకల్లో ఆయనతో పాటు మంత్రులు పువ్వాడ అజయ్ కుమార్(AJAY KUMAR), కొప్పుల ఈశ్వర్(Koppula Eswar), సత్యవతి రాథోడ్, ఎంపీ కేశవరావుతో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు.
ఆయా జిల్లా కేంద్రాల్లో మంత్రులు రంజాన్ వేడుకల్లో పాల్గొని ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. సనత్ నగర్లోని వెల్ఫేర్ సెంటర్ గ్రౌండ్, బన్సీలాల్పేట బోయగూడలోని క్యూబా మసీదు(Masid) వద్ద ప్రార్థనలలో పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్(Thalasani Srinivas Yadav) పాల్గొన్నారు. అన్ని మతాల అభివృద్ధికి బీఆర్ఎస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని పలువురు మంత్రులు స్పష్టం చేశారు. ఇటీవలే ప్రభుత్వ ఆధ్వర్యంలో ఎల్బీ స్టేడియం(LB stadium)లో ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. పవిత్ర రంజాన్ పర్వదినం సందర్భంగా రాష్ట్రంలోని మసీదులు, ఈద్గాల్లో ముస్లింలు సామూహిక ప్రార్థనలు చేస్తున్నారు. రంజాన్ పండుగ సందర్భంగా హైదరాబాద్(Hyerabad) నగరంలో పలు చోట్ల పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.