నెల్లూరు నగరంలోని మైపాడు రోడ్డు నిర్మాణంలో ఉన్న స్మార్ట్ స్ట్రీట్ బజార్ ప్రాజెక్టును శుక్రవారం మెప్మా డైరెక్టర్ తేజ్ భరత్ పరిశీలించారు. అనంతరం నెల్లూరులో ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కంటైనర్లను దుకాణాలుగా రూపొందించడం, పార్కింగ్ వసతి, డైనింగ్ సదుపాయం, పచ్చదనం, పరిశుభ్రత తదితర అంశాలతో స్మార్ట్ స్ట్రీట్ ప్రాజెక్ట్ ఆసక్తికరంగా ఉందన్నారు.