కరీంనగర్ జిల్లా కేంద్రంలోని చైతన్యపురి కాలనీలో గల శ్రీ మహాశక్తి ఆలయంలో అమ్మవారు గురువారం కాత్యాయని దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం పండ్లతో అమ్మవారికి విశేషాలంకరణ చేశారు. వందలాదిగా భవాని దీక్షపరులు ఆలయానికి తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు.