CBI : మాజీ గవర్నర్ సత్యపాత్ మాలిక్‌కు సీబీఐ నోటీసులు..
రిలయెన్స్ (Reliance) ఇన్సూరెన్స్ ప్రతిపాదిత బీమా పథకాన్ని ముందుకు తీసుకువెళ్లాలని ఆర్ఎస్ఎస్, బీజేపీ నేత రామ్ మాధవ్ అప్పట్లో అనుకున్నారని మాజీ గవర్నర్ సత్యపాల్ (Satya Pal Malik) తెలిపారు
జమ్మూకశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్(Satya Pal Malik)కు కేంద్ర దర్యాప్తు సంస్థ సమన్లు జారీ చేసింది. పుల్వామా దాడి సహా జాతీయ భద్రతపై ప్రధాని మోదీ (PM MODI) అనుసరిస్తున్న వైఖరి, ఇతర విషయాలపై ఆయన సంచలన విషయాలను వెల్లడించారు. ముఖ్యంగా పుల్వామా దాడి ప్రభుత్వ వైఫల్యమేనని ఆయన అన్నారు. రిలయన్ ఇన్సూరెన్స్ (Reliance Insurance) అంశానికి సంబంధించిన అంశంపై సీబీఐ (CBI) సమన్లను పంపించింది. ఈనెల 28న విచారణకు హాజరుకావాలని ఆ సమన్లలో కోరింది. ఢిల్లీలోని సీబీఐ కార్యాలయంలో ఆయనను ప్రశ్నించనున్నారు. జమ్ము కశ్మీర్(Jammu and Kashmir) లోని కిరు జలవిద్యుత్ ప్రాజెక్టు(Hydropower project) కు సంబంధించిన సుమారు 3.5 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు వర్తించే రూ.2,200 కోట్ల గ్రూప్ మెడికల్ ఇన్సూరెన్స్ పథకాన్ని 2018 సెప్టెంబర్‌లో అమలు చేశారు.
అయితే నాటి గవర్నర్ సత్యపాల్ మాలిక్ ఈ స్కీమ్‌ను ఒక్క నెలలోనే రద్దు చేశారు. ఈ స్కీమ్‌లో అవినీతి లొసుగులు ఉన్నాయని, ఫైల్ ఆమోదం కోసం తనకు రూ.300 కోట్లు లంచం ఇచ్చేందుకు ప్రయత్నించారని ఆయన ఆరోపించారు.ఈ నేపథ్యంలో జమ్ముకశ్మీర్ ప్రభుత్వ ఉద్యోగుల గ్రూప్ మెడికల్ ఇన్సూరెన్స్ (Medical Insurance) పథకానికి సంబంధించిన అవినీతి (Corruption) ఆరోపణలపై గత ఏడాది ఏప్రిల్‌లో సీబీఐ (CBI) రెండు కేసులు నమోదు చేసింది. రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్‌తో పాటు ట్రినిటీ రీఇన్స్యూరెన్స్ బ్రోకర్లను నిందితులుగా తెలిపింది. గత ఏడాది అక్టోబర్‌లో సత్యపాల్ మాలిక్‌ను సీబీఐ ప్రశ్నించింది. మరోవైపు ఈ పథకం ఫైల్‌ను ఆమోదించేందుకు ఆర్ఎస్ఎస్తోపాటు బీజేపీ నేత రామ్ మాధవ్ (Ram Madhav) తనకు డబ్బులు ఆఫర్ చేసినట్లు సత్యపాల్ మాలిక్ ఇటీవల ఆరోపించారు. అయితే అవి నిరాధార ఆరోపణలని రామ్ మాధవ్ తెలిపారు. సత్యపాల్ మాలిక్‌పై పరువు నష్టం కేసు వేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఈ కేసులో మరోసారి ప్రశ్నించేందుకు సత్యపాల్ మాలిక్‌కు సీబీఐ సమన్లు జారీ చేసింది.