CTR: చిత్తూరు జిల్లాకు వాతావరణ కేంద్రం గురువారం విశాఖపట్నం వాతావరణకేంద్రం ఎల్లో అలర్ట్ హెచ్చరిక జారీ చేసింది. ఒకటి లేదా రెండు చోట్ల మెరుపులతో కూడిన తేలికపాటి ఉరుములు, గంటకు 30-40 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపారు. కాగా, తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.