WGL: నర్సంపేట పట్టణంలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లే ప్రధాన రహదారి బురదమయమై, అద్వాన స్థితిలో ఉంది. ఈ రోడ్డుపై రోగులు నడవడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రూ. కోట్లతో నిర్మించిన ఆసుపత్రికి వెళ్లే రహదారి దుర్భర స్థితిలో ఉన్నా అధికారులు పట్టించుకోవడం లేదని రోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే రోడ్డు నిర్మాణ పనులు చేపట్టాలని ఇవాళ కోరారు.