KMM: స్థానిక సంస్థల ఎన్నికలకు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు సన్నద్ధం కావాలని బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర అన్నారు. గురువారం మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గస్థాయి విస్తృత సమావేశం నిర్వహించారు. రానున్న ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కృషి చేయాలని పార్టీ శ్రేణులకు మాజీ మంత్రి పువ్వాడ దిశా నిర్దేశం చేశారు.