కరీంనగర్ జిల్లా వీణవంక మండలం మామిడాలపల్లి గ్రామంలో శ్రీ పార్వతి రాజరాజేశ్వర స్వామి దేవాలయం ద్వితీయ వార్షికోత్సవ ఉత్సవాల్లో ఎంపీ ఈటల రాజేందర్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హుజూరాబాద్ బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ మాడ గౌతమ్ రెడ్డి సహా బీజేపీ నాయకులు చొప్పరి వేణు, ఎర్రబెల్లి సంపత్ రావు, పెద్ది మల్లారెడ్డి, రాజారామ్ గౌడ్ ఉన్నారు.