»Amitabh Shah Rukh Kohli Among Those Who Lost Twitter Blue Tick Details Here
Twitter blue tick కోల్పోయిన ప్రముఖులు.. అమితాబ్, షారుఖ్, కోహ్లీ సహా వీరే
ట్విట్టర్ బ్లూ టిక్ సబ్‌స్క్రైబ్ చేసుకోకపోవడంతో ప్రముఖులు బ్లూ టిక్ కోల్పోయారు. అమితాబ్, షారుఖ్, రాహుల్ గాంధీ, సీఎం జగన్, చంద్రబాబు, పవన్ తమ ఖాతాలకు బ్లూ టిక్ లాస్ అయ్యారు.
Amitabh, Shah Rukh, Kohli among those who lost Twitter blue tick Details here
Twitter blue tick:ట్విట్టర్ బ్లూ టిక్ (Twitter blue tick) సబ్‌స్క్రైబ్ చేసుకోవాలని కంపెనీ చాలా రోజుల నుంచి చెబుతోంది. అయినప్పటికీ ప్రముఖులు పెద్దగా పట్టించుకోలేదు.. దీంతో బ్లూ టిక్ (blue tick) కోల్పోయారు. సినీ సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు, స్పోర్ట్స్ పర్సన్స్, బిజెనెస్ మెన్స్ ఉన్నారు.
బాలీవుడ్ నుంచి అమితాబ్ బచ్చన్ (amitabh), షారుఖ్ ఖాన్ (shahrukh), అలియా భట్, దీపికా పదుకొనే, అనుష్క శర్మ టాలీవుడ్ నుంచి చిరంజీవి, మోహన్ బాబు, అల్లు అర్జున్, వెంకటేష్, ప్రకాశ్ రాజ్, మంచు మనోజ్, మంచు లక్ష్మీ, రకుల్ ప్రీత్ సింగ్, నితిన్, రామ్ చరణ్, నాగ చైతన్య, అక్కినేని అఖిల్ బ్లూ టిక్ కోల్పోయారు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (rahul gandhi), ప్రియాంక గాంధీ (priyanka gandhi), యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఏపీ సీఎం జగన్, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఉన్నారు. బీజేపీ, ఆప్, కాంగ్రెస్ పార్టీల అధికార ఖాతాలు కూడా బ్లూ టిక్ కోల్పోయాయి. మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా, జిరొదా కో ఫౌండర్ నిఖిల్ కామత్, అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ, విప్రో చైర్మన్ రిషద్ ప్రేమ్‌జీ, కొటక్ మహీంద్రా బ్యాంక్ చైర్మన్ ఉదయ్ కొటక్ కూడా బ్లూటిక్ కోల్పోయారు. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, పొప్ ప్రాన్సిస్ కూడా లాస్ అయ్యారు.
2009లో ట్విట్టర్ బ్లూ టిక్ (Twitter blue tick) వ్యవస్థను ప్రవేశపెట్టింది. బ్లూ టిక్ ఉన్న సెలబ్రిటీ, రాజకీయ నేత, క్రీడాకారులు, సంస్థలు అకౌంట్స్ ఒరిజినల్ అకౌంట్స్ అని నిర్ధారణ అవుతాయి. వారి పేరుతో ఇతరులు ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసినా.. ఒరిజనల్ అకౌంట్ కావని యూజర్లకు అర్థమయ్యేందుకు ఈ విధానాన్ని ట్విట్టర్ ప్రవేశపెట్టింది.
ట్విట్టర్‌ను మాస్క్ కొనుగోలు చేసిన తర్వాత రూపురేఖలు మార్చేశాడు. సంస్థలో ఉద్యోగుల తొలగింపు సహా అన్ని సంస్కరణలు చేశాడు. ఇప్పుడు బ్లూ టిక్ కావాలంటే నెలకు 11 డాలర్లు చెల్లించాలని రూల్ విధించాడు. కొందరు చెల్లించకపోవడంతో బ్లూ టిక్ తీసివేశారు. ఇప్పుడు వారి ఖాతాలు కూడా జనరల్ అవుతాయి. అందులో నిజమేదో.. అబద్ధమేదో తెలిసే అవకాశం లేదు.
ఇప్పటికీ ట్విట్టర్‌కు ప్రపంచవ్యాప్తంగా 3 లక్షల మంది (3 lakhs) బ్లూ టిక్ కలిగి ఉన్నారు. వారిలో నేతలు, జర్నలిస్టులు, క్రీడాకారులు ఉన్నారని న్యూజ్ ఏజెన్సీ ఏపీఎఫ్ రిపోర్ట్ చేసింది.