CM Post:టీ కాంగ్రెస్‌లో (t congress) అప్పుడే సీఎం పోస్టుపై (cm post) కిరికిరీ అప్పుడే మొదలైంది. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ గెలుస్తోందని.. సీఎం (cm) పదవీపై అప్పుడే నేతలు కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటివరకు ముగ్గురు నేతల పేర్లు బయటకు వచ్చాయి. ఎన్నికకు ఇంకా సమయం ఉండటంతో మరెంత మంది నేతలు వస్తారో చూడాలీ.
సీఎం రేసు ఇష్యూను ప్రారంభించింది మల్లు భట్టి విక్రమార్క (vikramarka). పాదయాత్రలో మాట్లాడుతూ.. హైకమాండ్ అవకాశం ఇస్తే సీఎం (cm) అవుతానని చెబుతున్నారు. ఇందిరమ్మ రాజ్యం తెస్తానని శపథం చేస్తున్నారు. ఇందుకు దళిత సీఎం కార్డు కూడా ప్రయోగిస్తున్నారు. పాదయాత్రతోపాటు.. అందరినీ కలుపుకునే ప్రయత్నంలో ఉన్నారు.
సీఎం రేసులో తాను ఉన్నానని రేవంత్ (revanth) డైరెక్ట్‌గా చెప్పడం లేదు. ఇండైరెక్టుగా హింట్ ఇస్తున్నారు. తన దృష్టి పార్టీ బలోపేతం గురించి మాత్రమేనని చెబుతున్నాడు. ఎన్నికల్లో కష్టపడి.. ప్రజల్లో పలుకుబడిని లెక్కలేసుకొని హైకమాండ్ తనకు పదవీ ఇచ్చిందని చెబుతున్నారు. కాంగ్రెస్ విజయం సాధిస్తోందని.. తానే సీఎం (cm) అవుతాననే ధీమాతో ఉన్నారు. రేవంత్ రెడ్డికి (revanth) సీఎం పదవీ దక్కకుండా చేసే పనిలో కాంగ్రెస్ సీనియర్లు సిద్దంగా ఉన్నారు. ఏదో ఒక అంశం మీద ఫిర్యాదు చేస్తున్నారు.
తానేమీ తక్కువ తినలేదని ఫైర్ బ్రాండ్ రేణుకా చౌదరి (renuka) అంటున్నారు. ఈ రోజు ఆమె నివాసంలో కాంగ్రెస్ నేతలు భేటీ అయ్యారు. భట్టి (bhatti) వ్యాఖ్యల నేపథ్యంలో మీట్ జరిగినట్టు తెలిసింది. రేవంత్ రెడ్డి, బలరాం నాయక్, సురేశ్ షెట్కర్ ఇతర నేతలు హాజరయ్యారు. ఇటీవల బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ అయిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని పార్టీలో చేర్పించే అంశంపై డిస్కషన్ చేశామని పైకి అంటున్నారు. ఆయన మాత్రం తనకు 10 మందికి టికెట్లు ఇస్తే.. పార్టీలోకి వస్తానని చెబుతున్నారు.
నిరుద్యోగ సభ కాంగ్రెస్ పార్టీలో కాక రేపుతోంది. ఈ నెల 24వ తేదీన ఖమ్మంలో నిరుద్యోగ సభ ఏర్పాటు చేశారు. ఆ రోజు తాను అందుబాటులో ఉండనని రేణుకా చౌదరి చెబుతున్నారు. మరో రోజున పెట్టాలని సూచించారు. ఇలా ప్రస్తుత పరిణామాలు.. సీఎం పోస్టు కోసం ఒక్కో నేత బయటపడుతున్నారు. ఇంకా కొందరు నేతలు చివరి నిమిషంలో బయటపడే అవకాశం ఉంది. ఏం జరుగుతుందో చూడాలీ మరీ.