NLR: నెల్లూరు నగర పాలక సంస్థ కమిషనర్ నందన్ పారిశుద్ధ్య పనుల పర్యవేక్షణలో భాగంగా స్థానిక గ్రాండ్ ట్రంకు రోడ్డు ప్రాంతంలో బుధవారం పర్యటించారు. డ్రైను కాలువలను ఆక్రమిస్తూ ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దని స్థానిక ప్రజలకు కమిషనర్ సూచించారు. ర్యాంపులు వంటి ఇతర నిర్మాణాలు పూడికతీతకు అడ్డంకి ఉంటే తప్పనిసరిగా తొలగించి వేస్తామని కమిషనర్ హెచ్చరించారు.