»Cbi Will Be Decide Where You Stay Nakka Ananda Babu Fire On Ys Jagan
సీఎం జగన్ ఆగాగు.. కాపురం ఎక్కడ పెట్టాలో CBI తేలుస్తుది: ఆనందబాబు
బ్రహ్మాండమైన క్రైమ్ థిల్లర్ ఈ సినిమా క్లైమాక్స్ జగన్ తో ఆగాలి. విచారణను అడ్డుకోవడంపై అడ్డమైన దారులు చేస్తున్నారు. ఆ కేసుల్లో అతడి భవిష్యత్ తేలాకే ఆయన కాపురం పెట్టుకోవాలి.
పరిపాలన రాజధానిగా విశాఖను (Vizag) చేస్తానని.. సెప్టెంబర్ లో కాపురం పెడతానని సీఎం జగన్ (YS Jagan) చేసిన ప్రకటనపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రాజధానిని విశాఖకు తరలించడం సబబు కాదని నిరసన వ్యక్తం చేస్తున్నారు. సీఎం ప్రకటనపై తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) నాయకులు మండిపడుతున్నారు. మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు (Nakka Anand Babu) సీఎం వ్యాఖ్యలపై స్పందించారు. ‘ఆయన కాపురం ఎక్కడ పెట్టాలో సీబీఐ తేలుస్తుంది’ అని ఎద్దేవా చేశారు.
గుంటూరులోని (Guntur) టీడీపీ కార్యాలయంలో గురువారం పార్టీ అధినేత చంద్రబాబు (Nara Chandrababu Naidu) జన్మదిన వేడుకలు నిర్వహించారు. కేక్ కోసిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘వివేకా (YS Vivekananda Reddy) హత్య కేసులో అసలు ముద్దాయి సీఎం వైఎస్ జగన్’ అని ఆరోపించారు. వైఎస్ భాస్కర్ రెడ్డి, ఎంపీ అవినాశ్ రెడ్డి పేర్లు బయటకు వచ్చాయని.. జగన్ ప్రమేయం కూడా త్వరలోనే వెల్లడి అవుతుందని అని తెలిపారు. వివేకా హత్య కేసు నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు విశాఖలో కాపురం వ్యాఖ్యలు చేశారని తెలిపారు. ఎన్నికల తర్వాత జగన్ కాపురం ఎక్కడ అనేది ప్రజలు తేలుస్తారు అని ఆనంద్ బాబు పేర్కొన్నారు.
‘బాబాయి వివేకా హత్య ఎవరో చేశారో అందరికీ తెలుసు. భాస్కర్ రెడ్డి, అవినాశ్ రెడ్డి పులివెందుల, జమ్మలమడుగులోనూ ఇదే చెబుతున్నారు. అసలు ముద్దాయి జగనే. బ్రహ్మాండమైన క్రైమ్ థిల్లర్ ఈ సినిమా క్లైమాక్స్ జగన్ తో ఆగాలి. విచారణను అడ్డుకోవడంపై అడ్డమైన దారులు చేస్తున్నారు’ అని నక్కా ఆనంద్ బాబు సీఎం జగన్ పై తీవ్ర విమర్శలు చేశారు. ‘12 కేసులు ఎదుర్కొంటున్నారు. ఆ కేసుల్లో అతడి భవిష్యత్ తేలాకే ఆయన కాపురం పెట్టుకోవాలి. ఒక్క చాన్స్ అంటూ అడిగితే ప్రజలు అధికారం ఇస్తే ఇప్పుడు ఓట్లు వేసిన ప్రజలే తప్పు చేశామని చెంపలు వేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది’ అని ఆనంద్ బాబు తెలిపారు.