»Apple Second Store Opens In New Delhi Tim Cook Delighted To Launch Store
I Phone రెండో స్టోర్ ప్రారంభం.. ఎగబడిన వినియోగదారులు
ఢిల్లీలో అద్భుత స్పందనకు ధన్యవాదాలు. మా కొత్త స్టోర్ కు వినియోగదారులను స్వాగతించడం ఆనందంగా ఉంది. స్టోర్ ప్రారంభోత్సవానికి పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు. అరుపులు, కేకలతో హల్ చల్ చేశారు.
భారతదేశంలో యాపిల్ సంస్థ (Apple) తన స్టోర్లను వరుసగా ప్రారంభిస్తోంది. నిన్న దేశ ఆర్థిక రాజధాని ముంబైలో (Mumbai) తొలి స్టోర్ ను అట్టహాసంగా ప్రారంభించింది. ఇక దేశ రాజధాని న్యూఢిల్లీలో (New Delhi) రెండో స్టోర్ ను యాపిస్ సంస్థ తెరిచింది. ఈ కేంద్రాన్ని యాపిల్ సాకెట్ సీఈవో టిమ్ కుక్ (Tim Cook) ప్రారంభించారు. ఢిల్లీలోని సాకేత్ సెలెక్ట్ సిటీవాక్ మాల్ (Apple Saket Store) లో కుక్ అధికారిక రిటైల్ స్టోర్ ను రిబ్బన్ కట్ చేశారు. ఈ స్టోర్ ప్రారంభానికి పెద్ద ఎత్తున వినియోగదారులు (Customers), యాపిల్ ఉత్పత్తుల అభిమానులు తరలివచ్చారు. అనంతరం కుక్ స్వయంగా వినియోగదారులకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కొందరితో సెల్ఫీలు, ఫొటోలు దిగి సందడి చేశారు.
కాగా ఈ స్టోర్ ప్రారంభోత్సవానికి పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు. అరుపులు, కేకలతో హల్ చల్ చేశారు. ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ లో యాపిల్ మొదటి స్టోర్ ప్రారంభమైంది. కాగా ఈ స్టోర్ల ప్రారంభానికి టిమ్ కుక్ భారతదేశానికి (India) వచ్చారు. ముంబైలో ప్రారంభించిన అనంతరం అదే రోజు ఢిల్లీకి చేరుకున్న టిమ్ కుక్ ప్రధాని మోదీని (Narendra Modi) కలిశారు. ఢిల్లీలో ప్రారంభమైన స్టోర్ లో 70 మంది యాపిల్ ఉద్యోగులు (Employees) వినియోగదారులకు సేవలు అందించనున్నారు. వీరిలో 18 రాష్ట్రాలకు చెందిన వారు ఉన్నారు. అందరూ కలిసి 15 భాషల్లో మాట్లాడగలరు. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద స్మార్ట్ ఫోన్ మార్కెట్ భారత్ లో ఉంది. 15 ఏళ్లలో యాపిల్ వ్యాపారానికి చైనాతో పాటు భారత్ మార్కెట్ ఎంతో దోహదం చేసింది.
‘ఢిల్లీలో అద్భుత స్పందనకు ధన్యవాదాలు. మా కొత్త స్టోర్ కు వినియోగదారులను స్వాగతించడం ఆనందంగా ఉంది’ టిమ్ కుక్ ట్వీట్ చేశారు. దీంతోపాటు స్టోర్ ప్రారంభానికి సంబంధించిన ఫొటోలను పంచుకున్నాడు.