»Yuvagalam Padayatra Nara Lokesh Open Challenge To Gummanur Jayaram On Ittina Company Lands
మంత్రి జయరామ్ 180 ఎకరాలు కొట్టేశాడు.. ఆధారాలు బయటపెట్టిన Nara Lokesh
వాణిజ్య భూమిగా ఉన్న భూమిని వ్యవసాయ భూములుగా చూపిన మంత్రి జయరామ్ తన కుటుంబం పేరుపై రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. రూ.45 కోట్ల విలువైన భూమిని రూ.2 కోట్లు ప్రభుత్వ విలువ చూపించి కారుచౌకగా జయరామ్ కొట్టేశాడు.
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ (Nara Lokesh) తన యువగళం పాదయాత్రలో అధికార వైఎస్సార్ సీపీ (YCP) నాయకుల అవినీతిని బట్టబయలు చేస్తున్నారు. ఏ నియోజకవర్గంలో పర్యటిస్తే ఆ నియోజకవర్గంలోని వైసీపీ ఎమ్మెల్యేల అవినీతి (Corruption) భండారం బయట పెడుతున్నారు. ఈ క్రమంలోనే కర్నూలు జిల్లాలో (Kurnool District) పాదయాత్ర చేస్తున్న లోకేశ్ ఆలూరు (Alur) నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే అయిన మంత్రి గుమ్మనూరు జయరామ్ (Gummanur Jayaram) అవినీతి అక్రమాలను ఆధారాలతో సహా బయటపెట్టారు.
ఆలూరు నియోజకవర్గంలోని ములిగుందం గ్రామం నుంచి గురువారం 76వ రోజు లోకేశ్ పాదయాత్ర (Yuvagalam Padayatra) ప్రారంభించారు. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే, మంత్రి గుమ్మనూరు జయరామ్ అవినీతిపై ఆధారాలు బహిర్గతం చేశారు. ‘ఇట్టినా కంపెనీకి (Ittina Company Lands) కేటాయించిన భూముల్లో 180 ఎకరాలను బెంజ్ మంత్రి (Benz Minister) కాజేశాడు. వాణిజ్య భూమిగా (కమర్షియల్ ల్యాండ్) ఉన్న భూమిని వ్యవసాయ భూములుగా చూపిన మంత్రి జయరామ్ తన కుటుంబం పేరుపై రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. రూ.45 కోట్ల విలువైన భూమిని రూ.2 కోట్లు ప్రభుత్వ విలువ చూపించి కారుచౌకగా జయరామ్ కొట్టేశాడు. వ్యవసాయంలో లాభం వచ్చిందని చెప్పిన మంత్రి మరి ప్రభుత్వం నుంచి పంట నష్ట పరిహారం ఎందుకు తీసుకున్నారు? రైతులు ముందుకు వస్తే ఇట్టినా భూములను రాసిస్తానన్న మంత్రి.. రిజిస్ట్రేషన్ తేదీ ప్రకటించాలని సవాల్ విసురుతున్నా’ అని లోకేశ్ మంత్రి జయరామ్ కు సవాల్ విసిరారు.
టీడీపీ (TDP) అధికారంలోకి రాగానే ఆ భూములను కొని రైతులకు పంచుతామని లోకేశ్ హామీ ఇచ్చారు. ల్యాండ్ సీలింగ్ యాక్ట్ నిబంధనలను మంత్రి, ఆయన కుటుంబం అతిక్రమించి భూములు కొనుగోలు చేశారని ఆరోపించారు. ఐటీ బినామీ చట్టం ప్రకారం బెంజ్ మంత్రి దొరికిపోయారని పేర్కొన్నారు. లోకేశ్ సంధించిన ప్రశ్నలకు మంత్రి జయరామ్ సమాధానం ఇవ్వాలని ఆలూరు మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ (Kotla Sujathamma) డిమాండ్ చేశారు. అనంతరం లోకేశ్ పాదయాత్ర కొనసాగించారు. యాత్రకు ప్రజల నుంచి భారీ స్పందన లభిస్తోంది.