తెలుగు రాష్ట్రాల్లో సీనియర్ రాజకీయ నాయకుడు.. మూడు సార్లు ముఖ్యమంత్రిగా పని చేసిన లీడర్ టీడీపీ (Telugu Desam Party) జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu). ఆయన గురువారంతో 73వ పడిలోకి అడుగుపెట్టారు. ఏప్రిల్ 20న ఆయన జన్మదినం (Birthday) సందర్భంగా ఆంధ్రప్రదేశ్ లో సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా టీడీపీ శ్రేణులు భారీ ఎత్తున సహాయ కార్యక్రమాలు చేపట్టారు. ఇక సోషల్ మీడియాలో చంద్రబాబు పేరు ట్రెండింగ్ (Trending)లో ఉంది. HBDTeluguPrideBabu, Nara Chandrababu Naidu అనే పేర్లు హ్యాష్ ట్యాగ్ ట్రెండవుతోంది.
మాజీ సీఎం చంద్రబాబుకు జనసేన పార్టీ (JanaSena Party) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan), వైఎస్సార్ సీపీ ఎంపీ విజయసాయి రెడ్డితో (VijayaSai Reddy) దేశంలోని వివిధ రాజకీయ పార్టీల నాయకులు, వివిధ రంగాల ప్రముఖులు చంద్రబాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ‘చంద్రబాబుకు జన్మదిన శుభాకాంక్షలు. భగవంతుడు సంతోషకర జీవితంతోపాటు సంపూర్ణ ఆయురారోగ్యాలు ఆయనకు ప్రసాదించాలని మనసారా కోరుకుంటున్నా’ అని పవన్ కల్యాణ్ ప్రకటన విడుదల చేశారు. ‘టీడీపీ అధ్యక్షులు, ప్రతిపక్ష నాయకులు నారా చంద్రబాబు నాయుడుకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. సంపూర్ణ ఆరోగ్యం, దీర్ఘాయుష్షుతో మరెన్నో ఆనందకరమైన పుట్టినరోజులు జరుపుకోవాలని ఆకాంక్షిస్తున్నా’ విజయసాయి ట్వీట్ చేశారు. సినీ దర్శకుడు గోపీచంద్ మలినేనితోపాటు ఇతర సినీ రంగ ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు.
ఎన్టీఆర్ ట్రస్ట్ (NTR Trust) నిర్వహిస్తున్న విద్యాలయంలో చంద్రబాబు జన్మదిన వేడుకలు జరిగాయి. తండ్రి జన్మదినం సందర్భంగా చంద్రబాబు తనయుడు నారా లోకేశ్ (Nara Lokesh) భావోద్వేగానికి లోనయ్యాడు. ‘పేదరికం లేని సమాజం స్థాపించి, ఆర్థిక అసమానతలు తొలగించే వ్యవస్థను తెలుగు ప్రజలకు శాశ్వత వారసత్వంగా ఇచ్చేందుకు మీరు చేస్తున్న కృషి మరువలేనిది. ప్రపంచంలో తెలుగు జాతి అగ్రస్థానంలో ఉండాలనే మీ కోరిక తీరాలి నాన్న. జన్మదిన శుభాకాంక్షలు నాన్న ’ అంటూ లోకేశ్ ట్వీట్ చేశారు.
I know how passionate you are to transform the lives of Telugu people and leave an everlasting legacy. May all your wishes come true Nana! Happy Birthday!#HBDTeluguPrideBabupic.twitter.com/3fWPFWFTsy
టీడీపీ అధ్యక్షులు, ప్రతిపక్ష నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. సంపూర్ణ ఆరోగ్యం, దీర్ఘాయుష్షుతో మరెన్నో ఆనందకరమైన పుట్టినరోజులు జరుపుకోవాలని ఆకాంక్షిస్తున్నా.