»Visakhapatnam Renamed Vizag Seethakonda Beach Abdul Kalam View Point As Ysr View Point
Abdul Kalamకు అవమానం.. మరో పేరు మార్చిన సీఎం జగన్
ఈ పనులకు రూ.3.42 కోట్లు వెచ్చించినట్లు మేయర్ ప్రకటించారు. రూ.కోటి కూడా ఖర్చు కాని ఈ పనులకు రెట్టింపు స్థాయిలో కేటాయింపులు చేయడం తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. దీనిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
దేశంలో కొత్త ట్రెండ్ కొనసాగుతోంది. అదే పేర్లు మార్చడం (Renamed) ప్రముఖ స్థలాలు, ప్రాంతాలు, నిర్మాణాల పేర్లు మారుతున్నాయి. జాతీయ స్థాయిలో ప్రధాని మోదీ కట్టడాలు, నగరాల పేర్లు మారుస్తుండగా.. ఇక ఆంధ్రప్రదేశ్ లో సీఎం జగన్ అదే పని చేస్తున్నాడు. ఇప్పటికే పలు వాటికి పేర్లు మార్చిన జగన్ తాజాగా విశాఖపట్టణంలో (Visakhapatnam) ఓ నిర్మాణం వద్ద పేరు మార్చాడు. ప్రతి దానికి తన తండ్రి పేరు నామకరణం చేస్తున్నాడు. మాజీ రాష్ట్రపతి, దేశానికి ఎన్నో సేవలు చేసిన గొప్ప శాస్త్రవేత్త డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం (APJ Abdul Kalam) పేరు తొలగించి వైఎస్సార్ పేరు తగిలించారు. దీనిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
విశాఖ నగరం బీచ్ రోడ్డులోని జోడుగుళ్లపాలెం వద్ద సీతకొండ (Seethakonda Beach) ప్రాంతం ఉంది. పర్యాటకులను అమితంగా ఆకట్టుకునే ఈ ప్రాంతంలో వ్యూ పాయింట్ (View Point) ఏర్పాటుచేశారు. ఇక్కడి నుంచి చూస్తే సముద్రం (Sea) అందాలు కనువిందు చేస్తాయి. ప్రజలు పెద్ద ఎత్తున గుమికూడుతుండడంతో అక్కడ అందరికీ స్ఫూర్తినిచ్చేలా ఏపీజే అబ్దుల్ కలామ్ పేర పెట్టారు. ఇప్పుడు ఆ పేరును మార్చేశారు. ‘వైఎస్సార్ వ్యూ పాయింట్’ అని పేరు రాయించారు. సీతకొండ ప్రాంతంలో చేసిన అరకొర అభివృద్ధి పనులు చేశారు. పైగా ఈ పనులకు రూ.3.42 కోట్లు వెచ్చించినట్లు మేయర్ ప్రకటించారు. రూ.కోటి కూడా ఖర్చు కాని ఈ పనులకు రెట్టింపు స్థాయిలో కేటాయింపులు చేయడం తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. ఈ పేరు మార్చడంపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) తప్పుబట్టారు.
పరిపాలన రాజధానిగా విశాఖను చేస్తానని సీఎం జగన్ మొండిగా వెళ్తున్నారు. అక్కడ తాను కాపురం ఉంటానని కూడా ప్రకటించాడు. ఈ క్రమంలోనే విశాఖలో తన మార్క్ ఉండేలా సీఎం చూసుకుంటున్నాడు. ఈ క్రమంలోనే పలుచోట్ల వైఎస్సార్ విగ్రహాలు ఆకస్మాత్తుగా వెలుస్తున్నాయి. పలు ప్రాంతాలకు పేర్లు మారుతున్నాయి. ఇంకా ఎన్నింటి పేర్లు మారుస్తాడేమో చూడాలి. గతంలో ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరు వైఎస్సార్ గా మార్చిన అంశం తీవ్ర వివాదాస్పదమైన విషయం తెలిసిందే.
Saddened to see Abdul Kalam View Point in Vizag being renamed as YSR View Point. What is this psychopathic sadism to change names? This is nothing but disrespecting a much loved people’s president who epitomized honesty, discipline, and perseverance. pic.twitter.com/MvfYIGnZjL