»Gujarat Rahul Gandhi Defamation Case Plea Surat Court Dismisses Dismisses
Rahul Gandhiకి మరోసారి చుక్కెదురు.. పరువు నష్టం పిటిషన్ కొట్టివేత
శిక్ష నిలిపివేయకపోతే తన ప్రతిష్ఠకు భంగం వాటిల్లుతుందని కోర్టుకు నివేదించారు. ఈ పిటిషన్ పై గత గురువారం వాదనలు విన్న అదనపు సెషన్స్ కోర్టు న్యాయమూర్తి ఆర్పీ మొగెరా (RP Mogera) తీర్పును నేటికి వాయిదా పడింది. నేటి విచారణలో శిక్షను రద్దు చేయాలని వేసిన పిటిషన్ ను కోర్టు కొట్టివేసింది.
ప్రస్తుతం రాజకీయాల కన్నా అత్యధికంగా కోర్టులో తిరుగుతున్న నాయకుడు రాహుల్ గాంధీ (Rahul Gandhi). బీజేపీని, నరేంద్ర మోదీపై తీవ్ర విమర్శలు చేస్తుండడంతో రాహుల్ పై వరుస కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలోనే మోదీ ఇంటి పేరుపై (Modi Surname Case) చేసిన వ్యాఖ్యలపై సూరత్ సెషన్స్ కోర్టు ( శిక్ష విధించిన విషయం తెలిసిందే. ఈ శిక్షతో తన పరువుకు నష్టం (Defamation Case) ఏర్పడిందని చెబుతూ అదే కోర్టులో రాహుల్ పిటిషన్ వేయగా.. కోర్టు ఆ పిటిషన్ ను కొట్టివేసింది. అయితే ఈ కేసుపై గుజరాత్ హైకోర్టును ఆశ్రయించనున్నారు.
2019 కర్ణాటక ఎన్నికల సమయంలో మోదీ ఇంటిపై చేసిన వ్యాఖ్యలకు ఇటీవల సూరత్ కోర్టు (Surat Metropolitan Magistrate Court) రెండేళ్ల జైలు శిక్ష విధించిన విషయం తెలిసిందే. గుజరాత్ కు చెందిన నాయకుడు పూర్ణేశ్ మోదీ (Purnesh Modi) వేసిన పిటిషన్ (Plea)పై కోర్టుపై శిక్ష విధించింది. అయితే ఈ కేసులో ట్రయల్ కోర్టు పారదర్శకంగా విచారణ చేయకుండా కఠినంగా వ్యవహరించిందని, శిక్ష విధించాల్సిన కేసు ఇది కాదంటూ రాహుల్ గాంధీ సెషన్స్ కోర్టును ఆశ్రయించారు. శిక్ష నిలిపివేయకపోతే తన ప్రతిష్ఠకు భంగం వాటిల్లుతుందని కోర్టుకు నివేదించారు. ఈ పిటిషన్ పై గత గురువారం వాదనలు విన్న అదనపు సెషన్స్ కోర్టు న్యాయమూర్తి ఆర్పీ మొగెరా (RP Mogera) తీర్పును నేటికి వాయిదా పడింది. నేటి విచారణలో శిక్షను రద్దు చేయాలని వేసిన పిటిషన్ ను కోర్టు కొట్టివేసింది. కాగా రెండేళ్ల జైలు శిక్ష విధింపుతో రాహుల్ లోక్ సభ సభ్యత్వాన్ని సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. సెషన్స్ కోర్టు ఈ తీర్పును రిజర్వ్ చేస్తే మళ్లీ అతడి పదవి లభించేది. కానీ సెషన్స్ కోర్టు నిరాకరించి పిటిషన్ కొట్టివేయడంతో రాహుల్ గుజరాత్ హైకోర్టును (Gujarat High Court) ఆశ్రయించనున్నారు.