IPL Betting:సిరాజ్‌తో కాంటాక్ట్.. ఏపీకి చెందిన ఒకరు అరెస్ట్
ఐపీఎల్లో బెట్టింగ్ కలకలం రేపింది. ఆర్సీబీ పేసర్ సిరాజ్‌తో ఏపీకి చెందిన ఒకరు వాట్సాప్ చేశారు. సిరాజ్ బీసీసీఐ యాంటి కరప్షన్ విభాగానికి సమాచారం ఇవ్వడంతో అతనిని అరెస్ట్ చేశారు.
IPL Betting:ఐపీఎల్ (IPL) సీజన్ రంజుమీదుంది. బెట్టింగులు (betting) కూడా జోరుగా సాగుతుంటాయి. ఆన్ లైన్, ఇండివిజువల్‌గా బెట్టింగ్ చేస్తుంటారు. ఐపీఎల్ సీజన్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ వ్యక్తి బెట్టింగ్ (betting) కాశాడు. భారీగా డబ్బు (money) నష్టపోయాడట. ఇంకేముంది తనను ఆదుకోవాలని హైదరాబాద్‌కు చెందిన పేసర్ మహ్మద్ సిరాజ్‌ను (siraj) ఆశ్రయించాడు. ఆర్థికసాయం చేయాలని సిరాజ్‌కు మెసేజ్ చేశాడు.
సిరాజ్ (siraj) నంబర్ ఎలా తెలిసిందో తెలియదు.. మెసేజ్ చూసిన వెంటనే సిరాజ్ బీసీసీఐ యాంటీ కరప్షన్ బృందానికి విషయం తెలియజేశాడు. వారు పోలీసులను (police) సంప్రదించడంతో అతనిని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం అతను పోలీసుల కస్టడీలో ఉన్నారు.
సిరాజ్‌కు (siraj) ఫోన్ చేసిన వ్యక్తి వైజాగ్‌కు (vizag) చెందిన డ్రైవర్ అని తెలుస్తోంది. ఆయన ఐపీఎల్ (ipl) కాకుండా ఇండియా- ఆస్ట్రేలియా వన్డే మ్యాచ్ ఫిక్సింగ్ కోసం అడిగినట్టు తెలిసింది. గత నెల 19వ తేదీన ఇండియా-ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. దీంతో ఒక్కసారిగా ఫిక్సింగ్ కలకలం రేపింది. అతనికి ఏ గ్యాంగ్‌తో సంబంధం లేదని.. మ్యాచ్ ఫిక్సింగ్ జరగలేదని పోలీసులు చెబుతున్నారు.