KMR: మద్నూర్‌లో ఇంటర్ ప్రథమ సంవత్సర పరీక్షలు గురువారం ప్రశాంతంగా ముగిశాయి. మ్యాథ్స్, జువాలజీ తదితర పరీక్షలకు మొత్తం 246 మంది విద్యార్థులకు గాను 242 మంది హాజరయ్యారని అధికారులు వెల్లడించారు. నలుగురు విద్యార్థులు గైర్హాజరు కావడంతో 98.37 శాతం హాజరు నమోదైంది. ఎటువంటి మాల్ ప్రాక్టీస్‌కు తావులేకుండా పటిష్ఠమైన నిఘా మధ్య పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు.