»Manchu Manoj Yem Manaso Special Song Gift To Bhuma Mounika
Yem Manaso Song భార్యకు మంచు మనోజ్ Surprise Gift.. హాజరైన వైఎస్ విజయమ్మ
తన మొదటి భార్యకు విడాకులు ఇచ్చిన అనంతరం మనోజ్ మానసిక ఆందోళనకు గురయ్యాడు. ఆ సమయంలో తనకు తోడుగా ఉన్న స్నేహితురాలు మౌనిక అండగా నిలబడింది. ఆ క్రమంలోనే వీరిద్దరి మధ్య ప్రేమ మొదలై పెళ్లి దాకా చేరింది.
రెండో వివాహం చేసుకున్న మంచు మనోజ్ (Manchu Manoj) వివాహానికి సంబంధించిన ఒక్కో వీడియోను విడతల వారీగా వదులుతున్నాడు. ఇటీవల తాము చేసుకున్న పెళ్లికి సంబంధించి ఓ పాటను విడుదల చేశాడు. ‘ఏం మనసో’ (Yem Manaso Song) అనే పాటను యూట్యూబ్ లో విడుదల చేశాడు. ఆ పాటలో తన పెళ్లి దృశ్యాలను ఉంచారు. ఎంతో ప్రేమపూర్వకంగా ఆ పాటను రూపొందించారు. ఆ పాటపై ఒక రోజు ముందు మీకు సర్ ప్రైజ్ ఉందని ప్రకటించాడు. అన్నట్టుగా తన భార్యకు పాటతో సర్ ప్రైజ్ ఇచ్చాడు.
ఆదిత్య మ్యూజిక్ లో విడుదలైన ఈ పాటను రాసింది అనంత శ్రీరామ్. తమిళ స్టార్ సంగీత దర్శకుడు అచు రాజమణి (Achu Rajamani) సంగీతం అందించాడు. ఈ పాటను తన భార్య భూమ మౌనికకు (Bhuma Mounika) బహుమతిగా మనోజ్ ఇచ్చాడు. మంగళవారం ఉదయం 9గంటలకు ఈ పాటను విడుదల చేశారు. ‘ఇలాంటి ప్రేమ జీవితంలో ఒకసార దొరుకుతుంది. నాకోసం ఉన్న ఏకైక మనిషివి నువ్వే. ఈ రోజే కాదు ఎప్పటికీ నీవాడినే. నా మీద అమిత ప్రేమ కనబరుస్తున్న నీకు థ్యాంక్యూ మౌనిక’ అంటూ రాసి పాటను మనోజ్ విడుదల చేశాడు.
కాగా వీడియో పాటలో మంగళస్నానాలు మొదలుకుని, సంగీత్, పెళ్లి వరకు ఉన్న దృశ్యాలు కనిపించాయి. తలంబ్రాలు, ఉంగరం తీయడం వంటివి ఈ పాటలో సరదాగా కనిపించాయి. అయితే ఈ పాటలో పలువురు ప్రముఖులు కనిపించారు. వైఎస్ విజయమ్మ (YS Vijayamma) పెళ్లికి హాజరై దంపతులను ఆశీర్వదించారు. బీఆర్ఎస్ పార్టీ (BRS Party) ఎమ్మెల్యేలు జీవన్ రెడ్డి (Jeevan Reddy), రోహిత్ రెడ్డి (Rohith Reddy) కనిపించారు. ఇక యువ హీరోలు సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej), సిద్ధూ జొన్నలగడ్డ (Sidhu Jonnalagadda) తదితరులు కనిపించారు. ఈ వీడియోలో కూడా మనోజ్ సోదరి మంచు లక్ష్మీప్రసన్న సందడి మామూలుగా లేదు. ఈ పాట చాలా భావోద్వేగంగా ఉంది.
ఏపీకి చెందిన దివంగత రాజకీయ నాయకులు భూమ నాగిరెడ్డి, శోభల రెండో కుమార్తె మౌనిక వివాహం మనోజ్ తో మార్చి 3న జరిగిన విషయం తెలిసిందే. అంగరంగ వైభవంగా వారి పెళ్లి జరిగింది. వీరిద్దరికి రెండో వివాహం అని అందరికీ తెలిసిందే. తన మొదటి భార్యకు విడాకులు ఇచ్చిన అనంతరం మనోజ్ మానసిక ఆందోళనకు గురయ్యాడు. ఆ సమయంలో తనకు తోడుగా ఉన్న స్నేహితురాలు మౌనిక అండగా నిలబడింది. ఆ క్రమంలోనే వీరిద్దరి మధ్య ప్రేమ మొదలై పెళ్లి దాకా చేరింది. ప్రస్తుతం మనోజ్ ‘వాట్ ది ఫిష్’ (What the fish), ‘మనం మనం బరంపురం’ సినిమాలతో మరో సినిమా కూడా చేస్తున్నాడు.
"THEY SAY THIS KIND OF LOVE IS ONCE IN A LIFETIME, AND I KNOW YOU ARE THE ONE FOR ME. I OFFER YOU ALL OF ME TODAY AND FOR ALWAYS. THANK YOU FOR SHOWING ME HOW IT FEELS TO BE LOVED" @BhumaMounika 💓