»Telangana After Karnataka Ill Be Focus On Telangana Says Rahul Gandhi With Tppc Leaders
కర్ణాటక తర్వాత నా దృష్టి తెలంగాణే: Rahul Gandhi
బీఆర్ఎస్ (BRS Party)తో పార్టీతో పొత్తు ఉండదని తేల్చి చెప్పండి అని రాహుల్ రాష్ట్ర నాయకత్వానికి సూచించారు. పొత్తు కొనసాగుతుందని ప్రచారం చేస్తూ బీజేపీ కుట్ర రాజకీయం చేస్తోందని, దానితో లబ్ధి పొందాలని చూస్తోందని వివరించారు.
కన్నడ నాట అధికారాన్ని సొంతం చేసుకుని ఆ విజయోత్సవంతో తెలంగాణలో అధికారం కోసం పని చేద్దామని కాంగ్రెస్ పార్టీ (Congress Party) అగ్ర నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) తెలిపాడు. కర్ణాటకలో ఎన్నికలు ముగియగానే తెలంగాణపై (Telangana) పూర్తి దృష్టి సారిస్తానని రాహుల్ తెలంగాణ నాయకులతో చెప్పారు. ప్రస్తుతం నా దృష్టి అంతా కర్ణాటకపై ఉందని పేర్కొన్నాడు. బీదర్ (Bidar)లో ఎన్నికల ప్రచారం ముగించుకుని ఢిల్లీ వెళ్లేందుకు సోమవారం శంషాబాద్ విమానాశ్రయం (Rajiv Gandhi International Airport- Shamshabad) చేరుకున్నాడు. ఈ సమయంలో టీపీసీసీ నాయకులు రాహుల్ ను కలిశారు. కొద్దిసేపు రాష్ట్ర నాయకత్వంతో రాహుల్ మంతనాలు జరిపారు. దాదాపు 30-35 నిమిషాల పాటు రాష్ట్ర నాయకులతో చర్చలు చేశారు.
ఈ సందర్భంగా రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జ్ మాణిక్ ఠాక్రే (Manik Thackray), టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (Revanth Reddy), మాజీ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, వి హనుమంతరావు, మధుయాష్కీ గౌడ్, ఏఐసీసీ కార్యదర్శులు నదీమ్ జావెద్, రోహిత్ చౌదరి తదితరులు కలిశారు. నాయకత్వంతో తెలంగాణలో జరుగుతున్న పరిణామాలు తెలుసుకున్నారు. అనంతరం రాహుల్ పార్టీ నాయకులకు కీలక సూచనలు చేశారు. బీఆర్ఎస్ (BRS Party)తో పార్టీతో పొత్తు ఉండదని తేల్చి చెప్పండి అని రాహుల్ రాష్ట్ర నాయకత్వానికి సూచించారు. పొత్తు కొనసాగుతుందని ప్రచారం చేస్తూ బీజేపీ కుట్ర రాజకీయం చేస్తోందని, దానితో లబ్ధి పొందాలని చూస్తోందని వివరించారు. ఆ ప్రయత్నానికి అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. కుల గణనపై పీసీసీ తీర్మానాలు చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపాలని సూచించారు. కర్ణాటక ఎన్నికలు ముగిశాక మే 15వ తేదీ తర్వాత తెలంగాణకు వస్తానని రాహుల్ ప్రకటించారు.
‘ఇక ఎక్కువ సమయం తెలంగాణకు కేటాయిస్తా’ అని రాహుల్ తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వంపై పెరుగుతున్న వ్యతిరేకతను పార్టీ వైపు తిప్పుకోవాలని చెప్పారు. ఈ సందర్భంగా హాథ్ సే హాత్ జోడో యాత్రల (Hath Se Hath Jodo Yatra) వివరాలు రేవంత్ రెడ్డిని అడిగి తెలుసుకున్నారు. కాగా ఈ యాత్రలకు జాతీయ నాయకులు పాల్గొంటే సానుకూల ప్రభావం ఉంటుందని రాష్ట్ర నాయకత్వం తెలిపింది. పార్టీ జాతీయ నాయకులు యాత్రల్లో పాల్గొనేలా చేస్తానని రాహుల్ చెప్పినట్లు సమాచారం.