»West Bengal Tmc Leader Mukul Roy Untraceable Since Monday Son Subhranshu Roy Complained
కేంద్ర మాజీ మంత్రి Mukul Roy అదృశ్యం.. బెంగాల్ లో కలకలం
కుటుంబంలో ఆస్తికి సంబంధించిన విషయాలపై గొడవలు జరుగుతున్నాయని తెలుస్తున్నది. ఈ క్రమంలోనే ఢిల్లీ వెళ్లే ముందు రోజు ఆదివారం కుమారుడితో గొడవ జరిగిందని సమాచారం.
పశ్చిమ బెంగాల్ (West Bengal)లో రోజుకో పరిణామం చోటు చేసుకుంటోంది. అధికార పార్టీ తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి (Trinamool Congress Party- TMC) షాక్ ల మీద షాక్ లు తలుగుతున్నాయి. వివిధ కేసుల్లో పార్టీ కీలక నాయకులు వరుసగా అరెస్టవుతున్నారు. పలువురి ఇళ్లల్లో దర్యాప్తు, విచారణ సంస్థలు సోదాలు చేస్తున్నాయి. ఇదిలా పార్టీలో నంబర్ 2 లాంటి వ్యక్తి, కేంద్ర మాజీ మంత్రి, టీఎంసీ అగ్ర నాయకుడు ముకుల్ రాయ్ (68) (Mukul Roy) అదృశమయ్యాడు. అకస్మాత్తుగా ఆయన కనిపించకుండాపోయాడు. అతడి అదృశ్యం (Missing) బెంగాల్ లో కలకలం రేపుతున్నది. అతడి కుమారుడు సుబ్రాన్ష్ రాయ్ (Subhranshu Roy) వివరాల ప్రకారం..
‘మా నాన్న కనిపించడం లేదు. అతడి ఆచూకీ లభించడం లేదు. సోమవారం సాంయంత్రం ఇండిగో విమానంలో ఢిల్లీకి ప్రయాణమయ్యాడు. విమానం రాత్రి 9.55 గంటలకు ఢిల్లీలో ల్యాండ్ అయ్యింది. కానీ మా నాన్న అప్పటి నుంచి కనిపించడం లేదు. అన్ ట్రేసేబుల్ గా ఉంది. అతడు కనిపించకుండాపోవడంపై ఎయిర్ పోర్టు పోలీసులకు ఫిర్యాదు చేశాం’ అని సుబ్రాన్ష్ తెలిపాడు. అయితే ఆయన అదృశ్యం వెనుక కుటుంబ సమస్యలే కారణంగా తెలుస్తున్నది.
భార్య (Wife) మృతి తర్వాత ముకుల్ రాయ్ ఒంటరిగా మారాడు. కుటుంబంలో ఆస్తికి (Assets) సంబంధించిన విషయాలపై గొడవలు జరుగుతున్నాయని తెలుస్తున్నది. ఈ క్రమంలోనే ఢిల్లీ వెళ్లే ముందు రోజు ఆదివారం కుమారుడితో గొడవ జరిగిందని సమాచారం. దీనికితోడు పైగా ముకుల్ ఆరోగ్యం కూడా బాగా లేదు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆస్పత్రిలో కొన్ని రోజులు ఉండి చికిత్స పొందారు. వీటన్నిటి నేపథ్యంలో ఆయన అదృశ్యమయ్యారని సమాచారం.
బెంగాల్ లో ముకుల్ రాయ్ పెద్ద నాయకుడు. టీఎంసీ ముఖ్యుల్లో ఆయన ఒకరు. 2017లో బీజేపీలో చేరారు. కానీ ఇమడలేకపోయారు. 2021 పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కమలం గుర్తుపై గెలిచాడు. అయితే ఆ తర్వాత బీజేపీ రాజకీయాలు నచ్చక వెంటనే తృణమూల్ కాంగ్రెస్ లో చేరిపోయారు. యూపీఏ హయాంలో మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో ముకుల్ రాయ్ రైల్వే శాఖ మంత్రిగా పని చేశారు. మమతా బెనర్జీ తర్వాత అంతటి శక్తివంతమైన నాయకుడు ముకుల్ రాయ్. ఆయన ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు.