CTR: బాసిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన ఖాదర్ బాషా తండ్రి బాబాసాహెబ్ అనారోగ్యంతో మృతి చెందారు. ఆయన మృతి తెలుగుదేశం పార్టీకి తీరని లోటు అని ఎస్ఆర్ పురం మండల టీడీపీ అధ్యక్షుడు గంధమనేని జయశంకర్ నాయుడు తెలిపారు. మృతదేహానికి ఇవాళ నివాళులర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించిన ఆయన, బాబాసాహెబ్ కుటుంబానికి టీడీపీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.