HYD: చెరువుల్లో గుర్రపుడెక్కను తుదముట్టించేందుకు సైబరాబాద్ మున్సిపల్ అధికారులు చేపట్టిన డ్రోన్ ప్రయోగం కామునిచెరువు వద్ద ఘోరంగా విఫలమైంది. అధునాతన సాంకేతికతతో గుర్రపుడెక్కను అంతం చేస్తామని ఆర్భాటంగా ప్రచారం చేసినా, క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం మునుపటిలాగే ఉంది. చెరువు నిండా పేరుకుపోయిన గుర్రపుడెక్క పచ్చని తివాచీలా దర్శనమిస్తోంది.