HNK: నగరంలోని బాలభవన్‌లో మే 1 నుంచి జూన్ 5 వరకు చిన్నారులకు లలిత కళలలో ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నట్లు మంగళవారం అధికారులు తెలిపారు. మృదంగం, కూచిపూడి నృత్యంలో నిష్ణాతులైన శిక్షకుల ఆధ్వర్యంలో ఈ తరగతులు నిర్వహించనున్నారు. 5 నుంచి 16 ఏళ్ల వయస్సు గల బాలబాలికలు అర్హులు కాగా, ప్రతిరోజూ ఉదయం 7 నుంచి 11 గంటల వరకు శిక్షణ కొనసాగుతుంది.