TG: హైదరాబాద్లో కుక్కల రక్తంతో వ్యాపారం చేస్తున్నారట. చికిత్స పేరుతో వీధికుక్కలను ఆస్పత్రి నిర్వాహకులు తీసుకొస్తారు. వాటి నుంచి రక్తం సేకరించి భద్రపరుస్తారు. అనారోగ్యంతో ఆస్పత్రికి వచ్చే పెంపుడు కుక్కలు వారి లక్ష్యం. వాటికి రక్తం అవసరం లేకున్నా.. రక్తం ఎక్కించాలని యజమానులను కంగారు పెడుతారు. అలా ప్యాకెట్ రక్తాన్ని రూ.18 వేల నుంచి రూ.25 వేల వరకు విక్రయిస్తున్నారు.