భద్రాచలం కొత్త ఎస్డీపీఓగా ఎం. అరుణ్ కుమార్ నియమితులయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా జరిగిన పోలీసు అధికారుల బదిలీల్లో భాగంగా ప్రభుత్వం ఈ మేరకు సోమవారం ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం ఇంటెలిజెన్స్ విభాగంలో డీఎస్పీగా విధులు నిర్వహిస్తున్న ఆయనను భద్రాచలానికి బదిలీ చేశారు. అరుణ్ కుమార్ త్వరలోనే ఇక్కడ బాధ్యతలు స్వీకరించనున్నారు.