హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధరలు వరుసగా నాలుగో రోజు తగ్గాయి. నిన్నటితో పోలిస్తే ఇవాళ 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.980 తగ్గి రూ.1,63,530కు చేరగా.. ఆభరణాలకు వాడే 22 క్యారెట్ల ధర రూ.900 తగ్గి రూ.1,49,900గా పలుకుతోంది. మరోవైపు వెండి ధరలో ఎలాంటి మార్పు లేకుండా కిలో రూ.2,95,000 వద్ద కొనసాగుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ దాదాపు ఇవే ధరలు ఉన్నాయి.