BPT: జిల్లాలో రబీ సీజన్‌కు సరిపడా 8, 641 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందని బుధవారం కలెక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. మార్చి 25 వరకు రైతులకు ఎటువంటి ఇబ్బంది ఉండదని, పీఏసీఎస్, రైతు సేవా కేంద్రాలు ప్రైవేట్ దుకాణాల్లో నిల్వలు సిద్ధంగా ఉన్నాయన్నారు. 45 కిలోల యూరియా బస్తా ధర రూ. 266.50 మాత్రమేనని, ఎవరైనా ఎక్కువ ధరకు విక్రయిస్తే చర్యలు తీసుకుంటామన్నారు.