NZB: అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో విశ్వ బ్రాహ్మణులకు రూ.1000 కోట్ల నిధులను కేటాయించాలని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు వడ్ల హనుమండ్లు చారీ డిమాండ్ చేశారు. గురువారం నిజామాబాద్ ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. విశ్వ బ్రాహ్మణ కార్పొరేషన్ పాలక మండలి ఏర్పాటు చేయాలని, పెన్షన్స్ సౌకర్యం కల్పించాలన్నారు. స్వర్ణకారులపై పోలీసుల దాడులు ఆపాలన్నారు